టాలీవుడ్ అభిమానులకు పండుగలా డిసెంబర్

by  |
Big releases
X

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా క్రిస్మస్ వారాంతం మినహా సినిమా పరిశ్రమలో డిసెంబర్‌ను ఆఫ్-సీజన్‌గా పరిగణిస్తారు. కాని ఈ ఏడాది డిసెంబరులో మాత్రం ప్రతి శుక్రవారం ఓ పెద్ద సినిమా వస్తోంది. డిసెంబర్ 2న నందమూరి బాలకృష్ణ అఖండతో వస్తున్నాడు. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మూడో ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన రావడంతో సినిమా ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్‌ను అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేష్ డిసెంబర్ 10న గుడ్ లక్ సఖితో రాబోతోంది. కీర్తి స్టార్ డమ్ ఈ సినిమాకు అడ్వాంటేజ్. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు డిసెంబర్ రెండో వారంలో రానుంది. అల్లు అర్జున్ తన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ పుష్పతో డిసెంబర్ 17న వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఉంది. ఖచ్చితంగా భారీ ఓపెనింగ్ ఉంటుందనే అనుకుంటున్నారు. ఇక వరుణ్ తేజ్, నాని తమ తమ చిత్రాలైన ఘని, శ్యామ్ సింగ రాయ్‌లతో క్రిస్మస్ 27న వస్తున్నారు. దీంతో టాలీవుడ్ అభిమానులకు డిసెండర్ ఒక పండగల మారబోతోంది.


Next Story

Most Viewed