నోట మాట రావడం లేదు : అమితాబ్

by  |
నోట మాట రావడం లేదు : అమితాబ్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతీ ఒక్కరి లైఫ్‌లోనూ హ్యాపీనెస్‌తో మాటలు రాని ఒక మోమెంట్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఆ సమయమే ఇప్పుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు వచ్చింది. ఎల్లో కలర్‌లో ఉన్న వింటేజ్ కారును చూసిన బచ్చన్‌కు ఇలాంటి సందర్భమే ఎదురైంది. కారు గురించి ఎంత వర్ణించాలని ఉన్నా… తనకు మాటలు రావడం లేదంటూ పోస్ట్ పెట్టాడు బిగ్ బి.

పింక్ కలర్ కుర్తాతో యెల్లో కలర్ వింటేజ్ కారు ముందు దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన బచ్చన్.. కొన్నింటిని చూస్తే మనకు నోట మాట రాదు. నేనిప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను. ఏదో చెప్పాలని ఉన్నా.. అసలు ఏమీ చెప్పలేకపోతున్నాను. ఈ కారును చూస్తే గడిచిన కాలం… అంతకు మించిన అనుభూతిని పొందుతున్నాను అంటూ ట్వీట్ చేశారు బచ్చన్. బిగ్ బితో పాటు ట్విట్టర్‌లో ఈ కారును చూసిన నెటిజన్లు సైతం ఫిదా అయిపోయారు.

Tags: Big B, Amitab Bachan, Speechless Moment

Next Story

Most Viewed