‘కేజీఎఫ్ 2’కు కౌంట్‌డౌన్ షురూ..

by  |
‘కేజీఎఫ్ 2’కు కౌంట్‌డౌన్ షురూ..
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ స్టార్‌​యశ్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్‌ చాప్టర్‌2’. ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్.. సినిమాపైనే ఆసక్తిని పెంచేలా ఉండగా, టీజర్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్‌ ప్రశాంత్‌.. యశ్‌ అభిమానులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌ అందించాడు. ఈ రోజు (సోమవారం) కేజీఎఫ్‌-2 నుంచి స్టన్నింగ్‌ లుక్‌ విడుదల చేయడంతో పాటు టీజర్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు.

‘సామ్రాజ్యపు తలుపులు తెరిచేందుకు కౌంట్‌డౌన్‌ ఇప్పుడు ప్రారంభమవుతుంది’ అని.. చేతిలో కర్ర పట్టుకొని, చీకట్లో దర్జాగా కూర్చున్న యశ్ ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు ప్రశాంత్ నీల్. అంతేకాదు రాఖీ బాయ్ వార్తలతో నిండిన ‘కేజీఎఫ్ టైమ్స్’ పేపర్‌‌ను మరో పోస్టర్‌గా రిలీజ్ చేశారు. అందులో ‘ఒకరు చేసే మంచి పనులతో అతడిని హీరోగా జడ్జ్ చేస్తాం.. అలానే చెడు పనులు చేస్తే ‘విలన్’గా పిలుస్తాం. మరి ఒకే వ్యక్తి రెండు చేస్తే.. అతడు హీరోనా? విలనా? రాఖీ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడా? స్వాతంత్ర్యం తర్వాత ముంబైలో హైఅలర్ట్, ఏ మదర్స్ ప్రామిస్, పవర్‌ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్‌ఫుల్ ప్లేసెస్’ వంటి ఎన్నో ప్రశ్నలకు, సందేహాలకు జనవరి 8న ఉదయం 10.18 నిమిషాలకు వచ్చే టీజర్ సమాధానాలు ఇవ్వనుందని మేకర్స్ వెల్లడించారు. కాగా టీజర్ ప్రకటనతో ‘కేజీఎఫ్‌ చాప్టర్‌2’ హ్యష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


Next Story

Most Viewed