మనాలికి కియారా.. కార్తీక్ ఆర్యన్‌తో రొమాన్స్?

by  |
Kiara Adwani, Karthik Aryan
X

దిశ, సినిమా: బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్, విద్యా బాలన్ కాంబినేషన్‌లో వచ్చిన హారర్ కామెడీ ‘భూల్ భులయ్యా’ సూపర్ హిట్ అయింది. దీనికి సీక్వెల్‌గా కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు మెయిన్ లీడ్స్‌తో ‘భూల్ భులయ్యా 2’ సీక్వెల్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో జైపూర్‌లో షూటింగ్ స్టార్ట్ కాగా, లక్నోలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ, కరోనా కారణంగా ఆగిపోయింది. అక్టోబర్, డిసెంబర్‌లో తిరిగి చిత్రీకరణ ప్రారంభం అవుతుందనుకున్నా కుదర్లేదు. వచ్చే వారం ఈ సినిమా చిత్రీకరణ మళ్లీ ప్రారంభించబోతున్నారట మేకర్స్. మనాలిలో నాలుగు రోజుల పాటు జరిగే సాంగ్ షూటింగ్‌లో కార్తీక్ ఆర్యన్, కియారా పాల్గొనే అవకాశం ఉండగా..ఆ తర్వాత మార్చిలో ముంబైలో షెడ్యూల్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. వెంటనే లక్నోలోనూ షూటింగ్ జరిపి ప్రాజెక్ట్‌కు ప్యాకప్ చెప్పేయాలని భావిస్తున్నారట మేకర్స్.

Next Story

Most Viewed