బిగ్ న్యూస్.. భూదాన్ పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు..

by Vadlamudi Anukaran |   (  Updated:2021-11-16 05:39:19  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో పోచంపల్లికి డిసెంబర్ 2వ తేదీన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో అవార్డును ప్రదానం చేయనున్నారు. అయితే పోచంపల్లి ప్రపంచ వ్యాప్తంగా చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. వెదిరె రామచంద్రారెడ్డి భూ దానోద్యమంలో భాగంగా కొన్ని వందల ఎకరాలను పేదలకు దానం చేసిన [&hellip;]</p>

బిగ్ న్యూస్.. భూదాన్ పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు..
X

దిశ, వెబ్‌డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో పోచంపల్లికి డిసెంబర్ 2వ తేదీన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో అవార్డును ప్రదానం చేయనున్నారు. అయితే పోచంపల్లి ప్రపంచ వ్యాప్తంగా చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. వెదిరె రామచంద్రారెడ్డి భూ దానోద్యమంలో భాగంగా కొన్ని వందల ఎకరాలను పేదలకు దానం చేసిన సందర్భంగా పోచంపల్లికి భూదాన్ పోచంపల్లికి అని పేరు వచ్చింది.

పోచంపల్లికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా పోచంపల్లి గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు.

Next Story