హీరోయిన్ తో నిశ్చితార్థం రద్దు.. సహించేది లేదు అంటూ వార్నింగ్

by  |
mehareen news
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ మెహరీన్ ఫిర్జాదా నిశ్చితార్ధం రద్దు వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హర్యానా రాజకీయ నాయకుడు కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు భవ్య బిష్ణోయ్ తో కొద్దీ రోజుల క్రితం అంగరంగవైభవంగా ఎంగేజ్ మెంట్ చేసుకున్న మెహరీన్ సడెన్ గా ఆ బంధానికి స్వస్తి పలికినట్లు పోస్ట్ పెట్టి అందరిని షాక్ కి గురిచేసింది. అయితే వీరి నిశ్చితార్థం రద్దు కావడంపై నెటిజన్ల నుంచి పలు కామెంట్లుచేస్తున్నారు. మెహరీన్ కి.. బిష్ణోయ్‌, అతని కుటుంబం సరైన గౌరవం ఇవ్వకపోవడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని నెటిజన్లు బిష్ణోయ్ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వార్తలపై తాజాగా భవ్య బిష్ణోయ్ స్పందించారు.

“మెహరీన్ ని కలిసినప్పటి నుంచి తనను నేను ఎంతగానో ప్రేమించాను. కానీ కొద్దీ రోజులకే మా ఇద్దరి అభిప్రాయాలు వేరని తెలిసాయి. అందుకే ఇద్దరం మనస్ఫూర్తిగానే పెళ్లిని రద్దు చేశాం. మెహరీన్ నుంచి విడిపోతున్నందుకు నేను బాధపడడం లేదు. ఇక ఈ విషయంలో ఎవరైనా తనను కానీ, తన కుటుంబాన్ని కానీ కించపరిచినట్లు మాట్లాడిన, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినా వారిపై తగిన చర్యలు తీసుకుంటాను. నాకు, నా కుటుంబానికి సమాజంలో మంచి గౌరవం ఉంది. మెహ్రీన్‌ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆమె కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Next Story