10 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలను సాధించిన భారత్‌పే

by  |
10 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలను సాధించిన భారత్‌పే
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఫిన్‌టెక్ సంస్థ భారత్‌పే ఈ ఏడాది మార్చిలో 10.6 కోట్ల లావాదేవీలను నిర్వహించినట్టు తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ చెల్లింపులను మూడు రెట్లు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో 2021, మార్చిలో కంపెనీ మొత్తం రూ. 6,140 కోట్ల విలువైన లావాదేవీలను నమోదు చేసినట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశీయ ఫిన్‌టెక్ పరిశ్రమలో భారత్‌పే 8.8 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. గడిచిన ఏడాది కాలంలో కంపెనీ యూపీఐ పర్సన్ టూ మర్చంట్ విభాగంలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధించింది. ముఖ్యంగా టైర్2, టైర్3 పట్టణాల్లో పర్సన్ టూ మర్చంట్ లావాదేవీలు అధికంగా నమోదైనట్టు కంపెనీ గ్రూప్ ప్రెసిడెంట్ సుహైల్ చెప్పారు.

అలాగే, 2020, ఏప్రిల్ నుంచి గత నెల వరకు కంపెనీ యూపీఐ లావాదేవీల పరిమాణం 7 రెట్లు వృద్ధి నమోదైందని, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో మాత్రమే 23.7 శాతం పెరిగినట్టు కంపెనీ తెలిపింది. కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులకు డిమాండ్ పెరిగిందని, గత 12 నెలల కాలంలో భారత్‌పే తన సేవలను 30 నగరాల నుంచి 100 నగరాలకు విస్తరించినట్టు కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరో 100 నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ అభిప్రాయపడింది.


Next Story

Most Viewed