- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోడి రామ్మూర్తికి భారతరత్న ఇవ్వాలి !
<p>దిశ, విశాఖపట్నం: కోడి రామ్మూర్తికి భారతరత్న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్రంపై ఒత్తిడి తెస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. కోడి రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని మంగళవారం శ్రీకాకుళంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కలియుగ భీముడు కోడి రామ్మూర్తి నాయుడని, ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గర్వ కారణమన్నారు. జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ క్యాలండర్‌లో కోడి రామ్మూర్తి జయంతిని చేర్చాలని, రాష్ట్ర పండుగగా కోడిరామ్మూర్తి జన్మదినాన్ని […]</p>

X
దిశ, విశాఖపట్నం: కోడి రామ్మూర్తికి భారతరత్న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్రంపై ఒత్తిడి తెస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. కోడి రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని మంగళవారం శ్రీకాకుళంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కలియుగ భీముడు కోడి రామ్మూర్తి నాయుడని, ఆయన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గర్వ కారణమన్నారు. జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ క్యాలండర్‌లో కోడి రామ్మూర్తి జయంతిని చేర్చాలని, రాష్ట్ర పండుగగా కోడిరామ్మూర్తి జన్మదినాన్ని జరిపేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. పాఠ్యాంశాల్లో కోడి రామ్మూర్తి చరిత్రను చేర్చే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.
Next Story






