రోడ్డు పాలవుతోన్న మిషన్ భగీరథ నీరు.. పట్టించుకునేవారే లేరు

by  |
రోడ్డు పాలవుతోన్న మిషన్ భగీరథ నీరు.. పట్టించుకునేవారే లేరు
X

దిశ, ధర్మపురి: ధర్మపురి మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణ వాడాలో మిషన్ భగీరథ నీరు వృధాగా రోడ్ల పై పోతున్న పట్టించుకునే నాథుడే లేడు. ఇష్టారాజ్యంగా పైపు లైన్లు వేసి సరిగ్గా కనెక్షన్ ఇవ్వకుండా రోడ్డు పైనే పైపులు వదలడంతో భగీరథ నీరు రోడ్డు పాలవుతోంది. ఈ క్రమంలోనే ధర్మపురిలోని చాలా వాడల్లో ఇళ్ల‌లోకి కనెక్షన్ ఇవ్వక పైపు లైన్లు రోడ్ల పైనే వదిలి వెళ్లడంతో నల్లా నీరు వృధాగా పోతోంది. ముఖ్యమంత్రి ప్రతి మీటింగ్‌లో ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చాం అని చెపుతున్నాడు కాని, ధర్మపురిలో మాత్రం ఇంకా సగానికి పైగా ఇళ్ల‌కు భగీరథ కనెక్షన్లు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా నాసిరకంగా పనులు చేసి అధికారులు, కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటి కైనా స్థానిక మంత్రి వర్యులు పట్టించుకొని కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన భగీరథ కొత్త పైపు లైన్లు ద్వారా మిషన్ భగీరథ నీరు ప్రజలకు అందేలా చూసి ముఖ్యమంత్రి మాటలను నిజం చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.



Next Story