డ్రైవర్ మోహం మీద దగ్గి… జాగ్రత్తగా ఉండమంది

by  |
డ్రైవర్ మోహం మీద దగ్గి… జాగ్రత్తగా ఉండమంది
X

దిశ, వెబ్ డెస్క్ : ఇప్పుడు అందరి భాద్యత మాస్కు పెట్టుకోవడం.. ఎలాంటి కార్యక్రమాలైనా, ప్రయాణాల్లో నైన మాస్క్ తప్పనిసరి. అయితే ఈ మాస్కు తప్పనిసరి అనేది ఓడ్రైవర్ ని ఇబ్బందులకు గురి చేసింది. మాస్కు తప్పనిసరి అని చెప్పడం వలన ఇబ్బంది ఏంటీ అనుకుంటున్నార..?

శుభకర్.. ఊబెర్ అండ్ లిఫ్ట్ లో డ్రైవర్ గా చేస్తున్నాడు. అయితే ఫ్రాన్సిస్కోలో ఓ మహిళ తన స్నేహితురాళ్లను అతను పికప్ చేసుకున్నాడు. వారికి మాస్క్ లేకపోవడంతో వారిని దగ్గరిలోని పెట్రోల్ బంక్ దగ్గర కారు ఆపి వారిని మాస్కు తీసుకొమ్మని చెప్పాడు. అయితే అందులో ఒక అమ్మాయి మాస్కు కొనడానికి వెళ్తుంటే మరో అమ్మాయి డ్రైవర్ మీదికి గొడవకి దిగింది. మోహం మీద దగ్గడం, అతను ఇయర్ ఫోన్స్ ని పాడుచేసింది. ఇంకో అమ్మాయి మాకు కరోనా వచ్చిందని కాంమెంట్ చేసింది.

వీరి గోలను తట్టుకోలేని ఆ డ్రైవర్ వారిని వారిని దిగి పొమ్మన్నాడు దీంతో వారు డ్రైవర్ పై పెప్పర్ స్ర్పే చల్లి వెళ్లిపోయారు. ఈ విషయం పై డ్రైవర్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం పై స్పందించిన ఆ అమ్మాయి ఇందులో తన తప్పేమి లేదని దీనికి రెండో కోణం ఉందని ట్విట్టర్ వేదికగా తెలిపింది.



Next Story

Most Viewed