తేజస్వికి నో ఎంట్రీ.. ఓయూలో టెన్షన్ టెన్షన్

by  |
తేజస్వికి నో ఎంట్రీ.. ఓయూలో టెన్షన్ టెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ జాతీయ యూత్ వింగ్ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్యను నగర పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం ఓయూ క్యాంపస్‌‌కు కార్యకర్తలతో వెళ్తున్న ఆయన్ను ఎన్‌సీసీ గేట్ వద్ద భారీకేడ్స్ అడ్డం పెట్టి ఆపేందుకు పోలీసులు యత్నించారు. అంతేకాకుండా, తేజస్విని క్యాంపస్ లోనికి అనుమతించడం కుదరదని చెప్పారు.

దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు, తేజస్వి సూర్య భారీకేడ్స్‌ను బలవంతంగా తొలగించి లోనికి వెళ్లారు. ఆ సమయంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట నెలకొంది. అనంతరం ఎంపీ సూర్య కార్యకర్తలతో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం సమీపంలో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దిశను చూపుతాయి. మనం వీటిని గెలుస్తాము, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలుస్తాము. దాంతో పాటే తమిళనాడు, కేరళలోనూ గెలుస్తాము. అప్పుడు దక్షిణ భారతం మొత్తం కాషాయ రంగును అలుముకుంటుందని కార్యకర్తలతో వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed