కూచ్‌బెహర్ కాల్పుల ఘటనలో నిందితులను వదిలేది లేదు: దీదీ

by  |
కూచ్‌బెహర్ కాల్పుల ఘటనలో నిందితులను వదిలేది లేదు: దీదీ
X

కోల్‌కతా : బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ సందర్భంగా కూచ్‌బెహర్ జిల్లాలో కేంద్ర బలగాల కాల్పులకు హతమైన నలుగురు మృతుల బంధువులను రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరామర్శించారు. కాల్పుల ఘటన జరిగిన అనంతరం 72 గంటల (3 రోజులు) పాటు కూచ్‌బెహర్‌కు రాజకీయ పార్టీల నాయకులు ఎవరూ వెళ్లొద్దని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈసీ విధించిన గడువు ముగియడంతో దీదీ అక్కడికి వెళ్లి బాధిత కుటుంబాలను కలిసి, వారిని ఓదార్చారు.

అనంతరం దీదీ మాట్లాడుతూ.. బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు. కూచ్‌బెహర్ కిల్లింగ్స్ ఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటనపై విచారణ చేసి.. నిందితుల్ని శిక్షించి.. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని దీదీ ప్రకటించారు. కూచ్‌బెహర్ కాల్పుల ఘటన నేపథ్యంలో మూడు రోజులు పాటు అక్కడికి ఎవరూ వెళ్లొద్దని ఈసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే నాలుగో రోజైనా కూచ్‌బెహార్ వెళ్తానన్న దీదీ.. తన మాట నిలబెట్టుకున్నారు.


Next Story