టయోటా భారీ డిస్కౌంట్స్.. ఆ కార్లపై రూ. 50 వేలు తగ్గింపు

by  |
టయోటా భారీ డిస్కౌంట్స్..  ఆ కార్లపై రూ. 50 వేలు తగ్గింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా తన మోడళ్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లకు ఇది వర్తిస్తుందని, నగదు డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. బీఎస్6 నిబంధనలతో వచ్చిన టయోటా అర్బన్ క్రూజర్, గ్లాంజా, యారిస్ మోడళ్లకు ఈ ఆఫర్ లభిస్తుందని, దేశీయంగా కార్ల అమ్మకాలను మరింత పెంచేందుకే ఈ ఆఫర్ ఇస్తున్నట్టు కంపెనీ వివరించింది. కాగా, ఈ ఆఫర్ ఈ నెల 30 వరకు మాత్రమే ఉంటుందని, ఇతర వాహనాలపై ఎలాంటి తగ్గింపులు ఇవ్వడంలేదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం టయోటా అర్బన్ క్రూజర్ షోరూమ్ ప్రారంభ ధర రూ. 8.62 లక్షలు ఉండగా, దీనిపై రూ. 20 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. గ్లాంజా మోడల్ ధర రూ. 7.34 లక్షలు ఉండగా, రూ. 20 వేల ప్రయోజనాలు అందిస్తోంది. యారిస్ మోడల్ ధర రూ. 9.16 లక్షలు ఉండగా, రూ. 50 వేల వరకు తగ్గింపును ప్రకటించింది. వీటితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూపంలో రూ. 25 వేల వరకు డిస్కౌంట్‌ను ఇస్తోంది

Next Story

Most Viewed