- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేములవాడ టెంపుల్‌లో షాకింగ్ వీడియో.. భక్తుల ఆగ్రహం
<p>దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఇద్దరు యాచకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలో ఇద్దరు యచకులు మద్యం మత్తులో ఇష్టారీతిగా తన్నుకున్నారు. ఆలయ పరిసరాల్లో ఉంటూ జీవనం సాగించే యాచకులు తరచూ ఇలాంటి వీరంగం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఆలయ పరిసరాల్లో జరగకుండా చూడాలని […]</p>

X
దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఇద్దరు యాచకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలో ఇద్దరు యచకులు మద్యం మత్తులో ఇష్టారీతిగా తన్నుకున్నారు.
ఆలయ పరిసరాల్లో ఉంటూ జీవనం సాగించే యాచకులు తరచూ ఇలాంటి వీరంగం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఆలయ పరిసరాల్లో జరగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
యాచకులు గొడవపడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భద్రత చర్యలు పర్యవేక్షించే పోలీసులతో పాటు, ఆలయ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నట్లు స్థానికులు విమర్శిస్తున్నారు.
Next Story






