బ్యూటిఫుల్ "రాధే శ్యామ్".. హార్ట్‌ఫీల్ ఫ్రెష్‌నెస్..

by  |
Radhe Shyam
X

దిశ, వెబ్ డెస్క్: డార్లింగ్ ఆఫ్ మిలియన్ హార్ట్స్..మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్..మిస్టర్ పర్ఫెక్ట్.. భారతీయ సినిమా రథాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన పవర్ ఫుల్ హార్స్..ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను జయించి గ్లోబల్ బాక్స్ ఆఫీస్ పని పట్టేందుకు పరుగులు పెడుతున్న ఛత్రపతి. ఇండియన్ సినిమా బాహుబలి ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు వీర లెవల్‌లో జరుపుకుంటున్నారు. రెండ్రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండగా ఇచ్చిన మాట ప్రకారం ఫ్యాన్స్‌కు ‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’ ట్రీట్ ఇచ్చాడు ప్రభాస్.

రోమియో జూలియట్..సలీమ్ అనార్కలి..దేవదాస్ పార్వతి..ఇప్పుడు రాధే శ్యామ్. ఎస్..బ్యూటిఫుల్ ‘రాధే శ్యామ్’ మోషన్ పోస్టర్ చూసాక కలిగే ఫీలింగ్ ఇదే. ఇండియన్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్ మోషన్ పోస్టర్‌లో ప్రేరణగా పూజ హెగ్డే గార్జియస్‌నెస్, విక్రమాదిత్య గా ప్రభాస్ క్లాసీ లుక్.. ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుండగా..బీజీఎం, విజువల్స్ మరింత బ్యూటీని యాడ్ చేశాయి. స్పెషల్‌గా సెల్ఫ్ మేడ్ స్టార్ ప్రభాస్ లుక్, మోషన్ పోస్టర్ అభిమానులకు ఫుల్ సాటిస్‌ఫాక్షన్ ఇచ్చింది.

డైరెక్టర్ రాధ‌కృష్ణ‌కుమార్ టేకింగ్, కాన్సెప్ట్‌లో కొత్తదనం కనిపిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్‌లో సోల్‌ఫుల్‌నెస్ హార్ట్ టచింగ్‌గా ఉంది. క్లీన్ అండ్ నీట్ డిఫరెంట్ లవ్ స్టోరీ అయిన రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ వావ్ అరచేతిలో అందమైన ప్రేమ కావ్యాన్ని చూపించగా..టీజర్, ట్రైలర్ కోసం వెయిటింగ్ అంటున్నారు ఫ్యాన్స్. లవర్ బాయ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటున్న అభిమానులు..అసలు ఇంత అందమైన, అద్భుతమైన మోషన్ పోస్టర్ ఎక్స్‌పెక్ట్ చేయలేదని..టీజర్‌ మించినట్లుగా ఉందని..మాకు కావాల్సింది ఇదే కదా అంటూ థాంక్స్ చెప్తున్నారు.


Next Story

Most Viewed