గుంటూరు జిల్లాలో లాక్‌డౌన్ మరింత పటిష్టం

by Vemula.Srinu Prasad |

<p>గుంటూరు జిల్లా వాసులను కరోనా వైరస్‌ ఆందోళనకు గురి చేస్తోంది. కేవలం వారంలోనే 30 కేసులు నమోదుకావడం కలకలం రేపింది. కరోనా ఆందోళన నేపథ్యంలో గుంటూరులో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు గుంటూరు రేజ్ ఐజీ ప్రభాకర్ రావు ప్రకటించారు. గుంటూరు నగరంలో రోడ్లపై ఎవరూ కనిపించకూడదని స్పష్టం చేశారు. 144 సెక్షన్ పటిష్ఠంగా అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. గుంటూరు నగరంలో ఏడు కేసులు నమోదు కావడంతో పోలీసు, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖాధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. [&hellip;]</p>

గుంటూరు జిల్లాలో లాక్‌డౌన్ మరింత పటిష్టం
X

గుంటూరు జిల్లా వాసులను కరోనా వైరస్‌ ఆందోళనకు గురి చేస్తోంది. కేవలం వారంలోనే 30 కేసులు నమోదుకావడం కలకలం రేపింది. కరోనా ఆందోళన నేపథ్యంలో గుంటూరులో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు గుంటూరు రేజ్ ఐజీ ప్రభాకర్ రావు ప్రకటించారు. గుంటూరు నగరంలో రోడ్లపై ఎవరూ కనిపించకూడదని స్పష్టం చేశారు. 144 సెక్షన్ పటిష్ఠంగా అమలు చేస్తున్నట్టు వెల్లడించారు.

గుంటూరు నగరంలో ఏడు కేసులు నమోదు కావడంతో పోలీసు, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖాధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. గుంటూరులో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయా ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 475 శాపింళ్లు సేకరించి పరీక్షలకు పంపారు. అందులో 326 మందికి నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. 323 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు ఆస్పత్రుల నుంచి 96 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంతర పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

మరోవైపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 68 క్వారంటైన్‌ కేంద్రాల్లో 450 మంది నిర్బంధంలో ఉన్నారు. స్థానిక వైద్య సిబ్బంది పర్యవేక్షణలో 1249 మంది గృహనిర్బంధంలో ఉన్నారు. వీరిలో ఎవరిలో అయినా కరోనా లక్షణాలు కనిపిస్తే వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని కనిపెట్టుకుని ఉన్నారు.

Tags: guntur, corona virus, ap, lockdown, ig prabhakar rao

Next Story