ఐపీఎల్ అధికార సమాచారం లేదు

by  |
ఐపీఎల్ అధికార సమాచారం లేదు
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ నిర్వహణ, వేదికలపై గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ శుక్రవారం వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మెగా టోర్నీ నిర్వహణపై ఎమిరైట్స్ క్రికెట్ బోర్డు, స్టార్ ఇండియా సహా ఎనిమిది ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఇంకా అధికారికంగా సమాచారం ఇవ్వలేదని తెలుస్తున్నది. ‘ఐపీఎల్ 2020పై మాకు అధికారిక సమాచారం అందలేదు. మేం ఆతిథ్యం ఇస్తామని చెప్పిన తర్వాత ఇరు బోర్డులు మాట్లాడుకోలేదు. కానీ, మేం లీగ్ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రధాన కార్యదర్శి ముబాషిర్ ఉస్మానీ అన్నారు. మరోవైపు బ్రాడ్ కాస్టర్ స్టార్ఇండియా కూడా బీసీసీఐ నుంచి అధికార సమాచారం కోసం వేచి చూస్తున్నది. ఐపీఎల్‌లో పాల్గొనే ఫ్రాంచైజీలకు కూడా ఎలాంటి విషయం చెప్పలేదు. వచ్చే వారంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం తర్వాత అనంతరం అందరికీ అధికారికంగా సమాచారం అందుతుందని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.



Next Story

Most Viewed