మూడేళ్ల పాటు వీవోతో ఒప్పందం

by  |
మూడేళ్ల పాటు వీవోతో ఒప్పందం
X

దిశ, స్పోర్ట్స్ : చైనీస్ మొబైల్ కంపెనీ వీవోతో ఐపీఎల్ భాగస్వామ్యాన్ని బీసీసీఐ తిరిగి పునరుద్దరించిన విషయం తెలిసిందే. గత సీజన్‌లో ఇండో-చైనా ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా తప్పుకున్నది. దీంతో డ్రీమ్11ను రూ.220 కోట్లకు తాత్కాలిక స్పాన్సర్‌గా తీసుకున్నారు. గురువారం జరిగిన మినీ వేలం ప్రారంభానికి ముందు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ వీవో రాబోయే మూడేళ్ల పాటు స్పాన్సర్‌గా ఉండబోతున్నదని ప్రకటించారు. వాస్తవానికి 2019 నుంచి 2022 వరకు నాలుగు సీజన్ల పాటు వీవో స్పాన్సర్‌గా వ్యవహరించడానకి ఏడాదికి రూ. 440 కోట్లకు ఒప్పందం జరిగింది. దీని ప్రకారం వచ్చే ఏడాది వీవో ఒప్పందం పూర్తి కావాలి. అయితే గత సీజన్‌లో వీవోను స్పాన్సర్‌గా సస్పండ్ చేయడంతో దాన్ని అదనంగా కలిపి 2023 వరకు వీవోను స్పాన్సర్‌గా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రూ. 440 కోట్ల ఒప్పందమే రాబోయే మూడేళ్ల పాటు కొనసాగనున్నట్లు చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉండటంతో వీవో కూడా పాత ఒప్పందానికే ఒప్పుకున్నట్లు తెలుస్తున్నది. ఐపీఎల్‌కు సంబంధించిన మిగిలిన స్పాన్సర్ల ఒప్పందాన్ని త్వరలోనే పునరుద్దరిస్తామని ఆయన తెలిపారు.


Next Story

Most Viewed