- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీమ్ ఇండియా కోచ్ పదవికి నోటిఫికేషన్
<p>దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా హెడ్ కోచ్, సహాయక సిబ్బంది కోసం ఈ వారం చివరన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న హెడ్ కోచ్ రవిశాస్త్రి, సపోర్టింగ్ స్టాఫ్ భరత్ అరుణ్, విక్రమ్ రాథోడ్, శ్రీధర్ టీ20 వరల్డ్ కప్ తర్వాత పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. రవిశాస్త్రికి కోచ్ పదవిలో కొనసాగడం ఇష్టం లేదని చెప్పడంతో బీసీసీఐ కొత్త కోచ్‌ను వెదికే పనిలో పడింది. టీ20 వరల్డ్ కప్ […]</p>

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా హెడ్ కోచ్, సహాయక సిబ్బంది కోసం ఈ వారం చివరన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న హెడ్ కోచ్ రవిశాస్త్రి, సపోర్టింగ్ స్టాఫ్ భరత్ అరుణ్, విక్రమ్ రాథోడ్, శ్రీధర్ టీ20 వరల్డ్ కప్ తర్వాత పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. రవిశాస్త్రికి కోచ్ పదవిలో కొనసాగడం ఇష్టం లేదని చెప్పడంతో బీసీసీఐ కొత్త కోచ్‌ను వెదికే పనిలో పడింది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన మూడు రోజుల తర్వాత న్యూజీలాండ్ జట్టు ఇండియాలో పర్యటించనున్నది. ఆ సీరీస్‌కు ముందే కొత్త కోచ్‌ను ఎంపిక చేస్తామని బీసీసీఐ చెప్పింది. ఈ సారి విదేశీ కోచ్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కోచ్‌కు సంబంధించిన అర్హతలు, ఇతర బాధ్యతలకు సంబంధించిన వివరాలన్నీ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించిందని.. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.






