చివరి మ్యాచ్‌లో పిచ్ మార్చేస్తారంటా..!

by  |
చివరి మ్యాచ్‌లో పిచ్ మార్చేస్తారంటా..!
X

దిశ, స్పోర్ట్స్ : అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన పింక్ బాల్ టెస్టు వివాదాలకు తెరతీస్తున్నది. మ్యాచ్ రెండో రోజే ముగియడంతో పిచ్‌పై ఇంగ్లాండ్ జట్టు పిర్యాదు చేయడానికి నిర్ణయించకుంది. దీంతో ఇదే స్టేడియంలో జరగాల్సిన నాలుగో టెస్టు కోసం పిచ్‌ను మార్చేయడానికి బీసీసీఐ నిర్ణయించుకుంది. గతంలో ఇలాగే పిచ్ అనూహ్యంగా టర్న్ అవడంతో నాగ్‌పూర్ పిచ్‌పై పిర్యాదులు వెళ్లాయి. దీంతో ఆ స్టేడియంలో కొంత కాలం అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగకుండా ఐసీసీ నిషేధించింది. నాలుగో టెస్టులో కూడా పిచ్ అలాగే స్పందిస్తే.. తర్వాత జరగాల్సిన టీ20 సిరీస్‌పై ప్రభావం పడనున్నది. దీంతో ఐసీసీ దర్యాప్తును తప్పించుకోవడానికి మొతేరాలో సరికొత్త పిచ్‌ను తయారు చేస్తున్నట్లు సమాచారం. పూర్తిగా ఫ్లాట్ పిచ్‌ను ఉపయోగించడం వల్ల ఇరు జట్లు భారీ స్కోర్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, మ్యాచ్ రిఫరీ శ్రీనాథ్ తనకు పిచ్‌పై అందిన పిర్యాదులను సిరీస్ ముగిసిన తర్వాతే ఐసీసీకి నివేదించే అవకాశం ఉండటంతో… చివరి మ్యాచ్ కోసం వేచిచూస్తున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed