మరోసారి బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం

44

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ మరోసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జనవరి 17 (ఆదివారం) నిర్వహించబోతున్నది. దేశవాళీ క్రికెట్‌ను తిరిగి ప్రారంభించడం, టీ20 వరల్డ్ కప్ పన్నుల వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. గతంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి తీర్మానించిన మినిట్స్‌కు ఆమోదముద్ర కూడా వేయబోతున్నది. ఇక జాతీయ క్రికెట్ అకాడమీలను జోన్ల వారిగా ఏర్పాటు చేయాలనదే దానిపైనే కాకుండా ప్రస్తుతం బెంగళూరులో ఉన్న అకాడమీకి అవసరమైన ఉద్యోగులను నియమించే ప్రక్రియపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఐసీసీ 2023-31కి సంబంధించిన ఈవెంట్ల బిడ్డింగ్‌పై కూడా చర్చజరుగనున్నది. ప్రస్తుతం కోల్‌కతాలోని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న సౌరవ్ గంగూలీతో చర్చించాల్సిన ముఖ్యంశాలను కూడా అపెక్స్ కౌన్సిల్ అజెండాలో పొందుపరుచనున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..