- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Billboard Music Awards: బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్‌లో ‘బీటీఎస్’ హవా
<p>దిశ, సినిమా: బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్(బీబీఎంఏ) 2021లో కొరియన్ పాప్ (కే-పాప్) మ్యూజిక్‌కు చెందిన బీటీఎస్ గ్రూప్ హవా కొనసాగింది. ఈ వేడుకలో మొత్తం నాలుగు అవార్డులు గెలుపొంది సత్తా చాటింది. తమ గ్రూప్ నామినేట్ అయిన నాలుగు కేటగిరీలు : ‘టాప్ సెల్లింగ్ సాంగ్, టాప్ డుయో/గ్రూప్, టాప్ సాంగ్ సేల్ ఆర్టిస్ట్, ఫ్యాన్ ఓటెడ్ టాప్ సోషల్ ఆర్టిస్ట్’లోనూ అవార్డ్స్ అందుకుంది. కాగా బీటీఎస్ గ్రూప్ నుంచి గతేడాది మొదటిసారి ఇంగ్లీష్‌లో రిలీజైన మెగాహిట్ […]</p>

దిశ, సినిమా: బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్(బీబీఎంఏ) 2021లో కొరియన్ పాప్ (కే-పాప్) మ్యూజిక్‌కు చెందిన బీటీఎస్ గ్రూప్ హవా కొనసాగింది. ఈ వేడుకలో మొత్తం నాలుగు అవార్డులు గెలుపొంది సత్తా చాటింది. తమ గ్రూప్ నామినేట్ అయిన నాలుగు కేటగిరీలు : ‘టాప్ సెల్లింగ్ సాంగ్, టాప్ డుయో/గ్రూప్, టాప్ సాంగ్ సేల్ ఆర్టిస్ట్, ఫ్యాన్ ఓటెడ్ టాప్ సోషల్ ఆర్టిస్ట్’లోనూ అవార్డ్స్ అందుకుంది. కాగా బీటీఎస్ గ్రూప్ నుంచి గతేడాది మొదటిసారి ఇంగ్లీష్‌లో రిలీజైన మెగాహిట్ ‘డైనమైట్’కు టాప్ సెల్లింగ్ సాంగ్ అవార్డు వరించడం విశేషం. ఇక ఈ కే-పాప్ బ్యాండ్ శుక్రవారమే తమ కొత్త సింగిల్ ‘బట్టర్’ రిలీజ్ చేయగా యూట్యూబ్‌లో గంటలోపే 17 మిలియన్ వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. కాగా ఈ పాటపై బీబీఎంఏ అవార్డ్స్ వేడుకలో పర్ఫార్మ్ చేసిన బీటీఎస్ గ్రూప్ మెంబర్స్ (ఆర్‌ఎం, జిన్, సుగా, జే-హోప్, జిమిన్, వీ అండ్ జుంగ్‌కాక్) ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చారు. నాలుగు అవార్డ్స్ కైవసం చేసుకోవడం పట్ల ‘బీటీఎస్ ఆర్మీకి, బీబీఎంఏ’కు కృతజ్ఞతలు తెలిపారు






