- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కని అలా చేశాడని.. స్నేహితులతో కలిసి బావను, బామ్మర్ది ఏం చేశాడంటే..?
by Batti.Sumithra |
<p>దిశ, అచ్చంపేట : భార్య భర్తల మధ్య గొడవలు సహజం. కానీ, అక్కను బావ మందలించాడనే కోపంతో బామ్మర్ది అతని స్నేహితులతో కలిసి బావ పై దాడి చేశారు. దీంతో చికిత్స పొందుతూ బావ మరణించిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకుందని తెలిపారు. ఈ క్రమంలో […]</p>

X
దిశ, అచ్చంపేట : భార్య భర్తల మధ్య గొడవలు సహజం. కానీ, అక్కను బావ మందలించాడనే కోపంతో బామ్మర్ది అతని స్నేహితులతో కలిసి బావ పై దాడి చేశారు. దీంతో చికిత్స పొందుతూ బావ మరణించిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకుందని తెలిపారు. ఈ క్రమంలో బావను బామర్ది గణేష్, అతని స్నేహితులు కలిసి చితకబాదడంతో తీవ్రగాయాలైన బాధితుడిని చికిత్స నిమిత్తం ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స అందిస్తుండగా బాధితుడు పంబ మల్లయ్య (40) మృతి చెందారని తెలిపారు. ఈ సంఘటనపై బాధిత బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజు తెలిపారు.
Next Story






