- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు తెలుగు వర్సిటీలో బతుకమ్మ వేడుకలు.. ముఖ్య అతిథిగా తమిళిసై
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఈ నెల 8వ తేదీన తెలుగు యూనివర్శిటీలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేష్ తెలిపారు. ఉదయం 11 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ వీసీ ప్రొఫెసర్ తంగేడ కిషన్ రావు అధ్యక్షత వహిస్తారని, విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారని […]</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఈ నెల 8వ తేదీన తెలుగు యూనివర్శిటీలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేష్ తెలిపారు. ఉదయం 11 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి వర్సిటీ వీసీ ప్రొఫెసర్ తంగేడ కిషన్ రావు అధ్యక్షత వహిస్తారని, విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా విశ్వ విద్యాలయాల్లో బతుకమ్మపై పరిశోధన చేసిన వక్తల ప్రసంగాలు ఉంటాయని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై బతుకమ్మ పాటలను ఆవిష్కరించిన సాంస్కృతిక సారధి, మహిళా కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని రిజిస్ట్రార్ వెల్లడించారు.
Next Story






