వరల్డ్ కప్ ఆడే టీ20 జట్టు ఈ సిరీస్‌తో తేలిపోతుంది..

by Kema Shiva Kumar |

<p>దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్ భారత క్రికెటర్లకు చాలా కీలకమని.. ఇక్కడి ప్రదర్శనతో వాళ్లు వరల్డ్ కప్ ఆడే జట్టులో స్థానం స్థిరపరుచుకునే అవకాశం ఉన్నట్లు టీమ్ ఇండియా బ్యాటింగ్ కోస్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లో భారత జట్టు మేనేజ్‌మెంట్ వరల్డ్ కప్ ఆడగలిగే ఆటగాళ్లను గుర్తించే పనిలో ఉన్నదని ఆయన అన్నారు. ఇంగ్లాండ్ సిరీస్ ముగిసేలోపు వరల్డ్ కప్ జట్టుపై ఒక అవగాహన [&hellip;]</p>

వరల్డ్ కప్ ఆడే టీ20 జట్టు ఈ సిరీస్‌తో తేలిపోతుంది..
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్ భారత క్రికెటర్లకు చాలా కీలకమని.. ఇక్కడి ప్రదర్శనతో వాళ్లు వరల్డ్ కప్ ఆడే జట్టులో స్థానం స్థిరపరుచుకునే అవకాశం ఉన్నట్లు టీమ్ ఇండియా బ్యాటింగ్ కోస్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లో భారత జట్టు మేనేజ్‌మెంట్ వరల్డ్ కప్ ఆడగలిగే ఆటగాళ్లను గుర్తించే పనిలో ఉన్నదని ఆయన అన్నారు. ఇంగ్లాండ్ సిరీస్ ముగిసేలోపు వరల్డ్ కప్ జట్టుపై ఒక అవగాహన వచ్చే అవకాశం ఉందన్నారు.

టీ20 వరల్డ్ కప్ ఇండియాలోనే ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో జరుగనున్నది. కాబట్టి భారత జట్టు బ్యాటింగ్ బలపడటానికి అనువైన ఎంపికలను పరిశీలిస్తున్నామని రాథోడ్ అన్నారు. భారత జట్టులో ఎవరైనా గాయపడినా, ఫామ్ కోల్పోయినా వెంటనే రెండో ఆప్షన్ ఉండేలా అందరినీ సిద్దం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతానికి టీమ్ ఇండియా జట్టు నిలకడగా ఆడుతున్నది. ఇదే ఫామ్ కొనసాగిస్తే జట్టులో పెద్దగా మార్పులు ఉండపోవచ్చు అని రాథోడ్ చెప్పారు.

Next Story