- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్‌లో రౌడీలు, గూండాలకు టికెట్లు: బండి సంజయ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో రౌడీలు, గూండాలకు టీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించిన ఆయన అధికార పార్టీపై విమర్శలు చేశారు. స్మార్ట్ సిటీగా చేస్తామని చెప్పిన సీఎం ఇప్పటివరకు చేసిందేమీ లేదన్నారు. మరోసారి అధికార పార్టీ చేతిలోకి వెళితే అభివృద్ధి కుంటు పడుతోందని విమర్శలు చేశారు. ఓరుగల్లును బీజేపీ చేతిలో పెడితే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ప్రజలకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో రౌడీలు, గూండాలకు టీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించిన ఆయన అధికార పార్టీపై విమర్శలు చేశారు. స్మార్ట్ సిటీగా చేస్తామని చెప్పిన సీఎం ఇప్పటివరకు చేసిందేమీ లేదన్నారు. మరోసారి అధికార పార్టీ చేతిలోకి వెళితే అభివృద్ధి కుంటు పడుతోందని విమర్శలు చేశారు. ఓరుగల్లును బీజేపీ చేతిలో పెడితే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ప్రజలకు తెలియజేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తోందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
Next Story






