సీఎం కేసీఆర్ అందుకు సమాధానం చెప్పాలి: బండి సంజయ్

by  |
సీఎం కేసీఆర్ అందుకు సమాధానం చెప్పాలి: బండి సంజయ్
X

దిశ, ఆర్మూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ద్రోహి అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహిస్తున్న విమోచన దినోత్సవ సభకు వెళ్తూ.. ఆయన ఆర్మూర్ క్షత్రియ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు ముఖ్యమైన పండుగల సందర్భంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం, దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవం, విశ్వకర్మ డేను తమ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎవరి కోసం తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జెండాను ఎగురవేయరో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జెండాను ఎగురవేయడానికి ముఖ్యమంత్రికి సమయం లేకపోవడమంటే ప్రజలను అవమానించడమేనని విమర్శించారు.



Next Story

Most Viewed