విలేకరుల మీద కాదు.. కేసీఆర్‌పై కేసు పెట్టాలి

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-06 07:45:46  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నా..సీఎం కేసీఆర్ ప్రజలను గాలికొదిలేశారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండ్ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటే కరోనా రాదని, 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో కరోనా వైరస్ బతకదంటూ ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు. ఇలాంటి అసత్య ప్రకటనలు చేసిన కేసీఆర్‌పై తక్షణమే కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వేడి నీళ్లు తాగితే కరోనా రాద్దంటూ మంత్రులు సైతం దారుణంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం [&hellip;]</p>

విలేకరుల మీద కాదు.. కేసీఆర్‌పై కేసు పెట్టాలి
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నా..సీఎం కేసీఆర్ ప్రజలను గాలికొదిలేశారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండ్ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటే కరోనా రాదని, 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో కరోనా వైరస్ బతకదంటూ ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు. ఇలాంటి అసత్య ప్రకటనలు చేసిన కేసీఆర్‌పై తక్షణమే కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

వేడి నీళ్లు తాగితే కరోనా రాద్దంటూ మంత్రులు సైతం దారుణంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై తప్పుడు వార్త ప్రచురించారంటూ ఖమ్మంకు చెందిన ఓ విలేకరిపై అక్రమ కేసు బనాయించడం కక్ష సాధింపులకు పాల్పడటమేనని, రాష్ట్రవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నా పరీక్షలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

Next Story