- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్టీలో జోష్ తీసుకొచ్చేందుకే పాదయాత్ర: బండి సంజయ్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల, జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జీలు, సహాయ ఇన్ చార్జుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో ఈటల గెలుపు తధ్యమన్నారు. ఆగస్టు 9 నుంచి చేపడుతున్న పాదయాత్రలో పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయం చేయాలని కోరారు. పార్టీలో నూతనోత్సవం నింపేందుకు, ప్రభుత్వం […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల, జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జీలు, సహాయ ఇన్ చార్జుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో ఈటల గెలుపు తధ్యమన్నారు. ఆగస్టు 9 నుంచి చేపడుతున్న పాదయాత్రలో పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయం చేయాలని కోరారు. పార్టీలో నూతనోత్సవం నింపేందుకు, ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు లక్ష్మణ్, విజయశాంతి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, పార్టీ ముఖ్యులు పాల్గొన్నారు.
Next Story






