క్రాక్ నుంచి ‘శ్రుతి’ మాస్ నెంబర్

by  |
క్రాక్ నుంచి ‘శ్రుతి’ మాస్ నెంబర్
X

దిశ, వెబ్‌డెస్క్: గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న చిత్రం ‘క్రాక్’. దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుంచి రిలీజైన మాస్ సాంగ్ ‘బూమ్ బూమ్ బద్దలే’ ఇప్పటికే అందరితో ఈలలు కొట్టిస్తోంది. మాస్ హీరోతో అప్సర రాణి వేసిన స్టెప్పులు ప్రేక్షకుల్లో హై ఓల్టేజ్‌ కరెంట్ పుట్టించగా, ఇప్పుడు బ్యూటీ క్వీన్ శ్రుతి హాసన్ ప్రేక్షకులతో గోల పెట్టించడానికి బ్లాస్టింగ్ మాస్ నెంబర్‌తో వచ్చేసింది. ‘క్రాక్’ చిత్ర యూనిట్ ఆదివారం ‘భల్లేగా తగిలావే బంగారం’ అంటూ మరో మాస్ సాంగ్‌ టీజర్ విడుదల చేయగా, థమన్ బీట్స్ అద్దిరిపోయాయి. అయితే రవితేజతో శ్రుతి హాసన్ వేసిన మాస్ స్టెప్పులు చూడాలంటే మాత్రం ఫుల్ వీడియో సాంగ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సూపర్ బీట్‌కు థమన్ సంగీతం సమకూర్చగా, వోకల్స్ అనిరుధ్ అందించడం విశేషం. ఇద్దరు టాప్ సంగీత దర్శకులు పనిచేసిన ఈ పాట ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉండబోతుందని ఊహించేస్తున్నారు అభిమానులు. రవితేజ ఎకౌంట్‌లో మరో బ్లాస్టింగ్ బ్లాక్ బస్టర్ పక్కా అని సంబరపడిపోతున్నారు.


Next Story

Most Viewed