- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ 9 గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయ్
by Shyam |
<p>దిశ, చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని ఎర్రగుంటపల్లి వద్ద రూ. 8 కోట్ల 23 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన రోడ్డు నిర్మాణానికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు గంగారం నుండి పొన్నారం వయా బీరవెల్లి, నాగపూర్ వరకు నిర్మించబడుతుందని, దీని ద్వారా 9 గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు రవాణా కష్టాలు తీరుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మోతి తిరుపతి, […]</p>

X
దిశ, చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని ఎర్రగుంటపల్లి వద్ద రూ. 8 కోట్ల 23 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన రోడ్డు నిర్మాణానికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు గంగారం నుండి పొన్నారం వయా బీరవెల్లి, నాగపూర్ వరకు నిర్మించబడుతుందని, దీని ద్వారా 9 గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు రవాణా కష్టాలు తీరుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మోతి తిరుపతి, మండల పరిషత్ అధ్యక్షులు మంత్రి బాపు, వివిధ గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






