- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ ప్రభుత్వంపై బాలయ్య తీవ్ర విమర్శలు
<p>దిశ వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. రోజుకి నాలుగైదు డివిజన్లలో ప్రచారం నిర్వహిస్తున్న బాలయ్య.. ఇవాళ ప్రచారంలో భాగంగా ఏపీ ప్రభుత్వంపై దమ్మెత్తిపోశారు. సీఎం జగన్ రాష్ట్రాభివృద్ధిని పక్కనపెట్టి వీడియో గేమ్‌లు ఆడుకుంటున్నారని, కనీసం జగన్ మంత్రులకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వరని బాలయ్య విమర్శించారు. ఒక్కో మాఫియాకు ఒక్కో మంత్రిని ఏర్పాటు చేశారని, చంద్రబాబును బూతులు తిట్టేందుకు ఒక మంత్రిని నియమించారంటూ కొడాలి నాని గురించి మాట్లాడారు. […]</p>

దిశ వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. రోజుకి నాలుగైదు డివిజన్లలో ప్రచారం నిర్వహిస్తున్న బాలయ్య.. ఇవాళ ప్రచారంలో భాగంగా ఏపీ ప్రభుత్వంపై దమ్మెత్తిపోశారు. సీఎం జగన్ రాష్ట్రాభివృద్ధిని పక్కనపెట్టి వీడియో గేమ్‌లు ఆడుకుంటున్నారని, కనీసం జగన్ మంత్రులకు కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వరని బాలయ్య విమర్శించారు.
ఒక్కో మాఫియాకు ఒక్కో మంత్రిని ఏర్పాటు చేశారని, చంద్రబాబును బూతులు తిట్టేందుకు ఒక మంత్రిని నియమించారంటూ కొడాలి నాని గురించి మాట్లాడారు. రెండేళ్లల్లో ఏం చేశారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదని, అందుకే పోలీసులు, వాలంటీర్ల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
కాగా ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో బాలయ్య హీరోగా నటిస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా సగం పూర్తి అయింది. ఈ సినిమా షూటింగ్ నుంచి బాలయ్య కాస్త గ్యాప్ తీసుకుని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.






