రంగంలోకి దిగిన బాలయ్య

by  |
రంగంలోకి దిగిన బాలయ్య
X

దిశ వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల వేడి రాజేస్తూనే ఉంది. పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి మొదలైన రాజకీయ వేడి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరగ్గా.. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల పోరు కాక రేపుతోంది. అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీని తర్వాత త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.

ప్రస్తుతం ఏపీలో మున్సిపల్ పోరు జరుగుతుండగా.. మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. హిందూపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హిందూపురం మున్సిపాలిటీలో బాలయ్య ప్రచారం చేయనున్నారు.

ఇవాళ మోత్కుపల్లి, విద్యానగర్, బోయపేట, నింకంపల్లి, మేలపురం, విజయనగర్ కాలనీ, ముదిరెడ్డి పల్లి, సింగిరెడ్డి పల్లి ప్రాంతాల్లో బాలయ్య ప్రచారం చేయనున్నారు. రేపు కూడా బాలయ్య ప్రచారం కొనసాగే అవకాశముంది. కాగా ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్‌లో బాలయ్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed