గోన గన్నారెడ్డిగా బాలయ్య?

by  |
గోన గన్నారెడ్డిగా బాలయ్య?
X

దిశ, వెబ్‌డెస్క్ :
నటసింహం నందమూరి బాలకృష్ణకు పురాణ ఇతిహాసాలు, జానపద కథల్లో నటించడం కొత్తేమీ కాదు. శ్రీరామ రాజ్యం, పాండురంగ మహత్యం, గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలే ఇందుకు ఉదాహరణ కాగా.. ఇప్పుడు అలాంటిదే మరో సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. గుణశేఖర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన రుద్రమదేవి సినిమాలో ‘గోన గన్నారెడ్డి’ పాత్ర ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అల్లు అర్జున్ ఆ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. కానీ సినిమాలో పాత్ర పరిధి కొంతమేరకు మాత్రమే ఉంటుంది. కాగా ఇప్పుడు గోన గన్నారెడ్డి పాత్రను హైలెట్ చేస్తూ బాలయ్య ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.

గోన గన్నారెడ్డి గురించి ప్రజలకు అంతగా తెలియకపోవడంతో.. ఆయన గురించి ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధం అవుతున్నారని సమాచారం. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో 106వ సినిమా చేస్తున్నాడు. రెండు పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించబోతున్న బాలయ్య.. త్వరలో ఈ సినిమా పూర్తి చేసి.. గోన గన్నారెడ్డి సినిమాను ప్రారంభించబోతున్నారని టాక్. కాగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తుండగా.. త్వరలో కాస్ట్ అండ్ క్రూ గురించి వివరాలు వెల్లడించనున్నారు.



Next Story