భీష్మ పితామహుడి పాత్రలో బాలయ్య..

70

దిశ, సినిమా : భీష్మ ఏకాదశి సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రం నుంచి భీష్మ పితామహుడి పాత్రలో ఉన్న తన స్టిల్స్‌ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. భీష్ముడి పాత్రంటే తనకు ఇష్టమని.. నాన్నగారు(ఎన్టీఆర్) తన వయసుకు మించిన పాత్రలో (భీష్ముడిగా) జీవించి అశేష ప్రేక్షక ఆదరాభిమానాలు చూరగొన్నారని తెలిపారు. అందుకే ఎన్టీఆర్ బయోపిక్‌లో భీష్మ క్యారెక్టర్‌కు సంబంధించిన సన్నివేశాలు తనపై చిత్రీకరించామని తెలిపారు. కానీ నిడివి ఎక్కువ కావడంతో కత్తిరించేయాల్సి వచ్చిందన్న బాలయ్య.. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పాత్రకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..