సీఎం ఇంటి ముట్టడికి యత్నం…కార్యకర్తల అరెస్టు…

by  |
సీఎం ఇంటి ముట్టడికి యత్నం…కార్యకర్తల అరెస్టు…
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్:
ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా లోటస్ పాండ్‌లోని ఏపీ సీఎం జగన్ ఇంటిని బజరంగ్‌దళ్ కార్యకర్తలు బుధవారం ముట్టడించారు. ఈ సందర్బంగా పోలీసులకు బజరంగ్‌దళ్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ఏపీ సీఎం జగన్ నివాసంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు బజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బజరంగ్‌దళ్ కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Next Story