- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవాస్కర్‌కు కౌంటర్ ఇచ్చిన బెయిర్ స్టో..
by Kema Shiva Kumar |
<p>దిశ, వెబ్ డెస్క్ : టీం ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో విఫలమైన ఇంగ్లాండ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో వన్డే సిరీస్‌లో అద్భుత ఫామ్ కనబరుస్తున్నాడు. టెస్టు సిరీస్‌లో బెయిర్ స్టో విఫలం కావడంతో భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అతడిపై విమర్శలు చేశారు. బెయిర్ స్టో క్రీజులో కదిలే విధానం చూస్తుంటే ఆడేందుకు ఏమంత ఆసక్తిగా ఉన్నట్టు కనిపించడంలేదని అన్నారు. గవాస్కర్ వ్యాఖ్యలకు తాజాగా రెండో వన్డే అనంతరం బెయిర్ స్టో కౌంటర్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : టీం ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో విఫలమైన ఇంగ్లాండ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో వన్డే సిరీస్‌లో అద్భుత ఫామ్ కనబరుస్తున్నాడు. టెస్టు సిరీస్‌లో బెయిర్ స్టో విఫలం కావడంతో భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అతడిపై విమర్శలు చేశారు. బెయిర్ స్టో క్రీజులో కదిలే విధానం చూస్తుంటే ఆడేందుకు ఏమంత ఆసక్తిగా ఉన్నట్టు కనిపించడంలేదని అన్నారు. గవాస్కర్ వ్యాఖ్యలకు తాజాగా రెండో వన్డే అనంతరం బెయిర్ స్టో కౌంటర్ ఇచ్చాడు.
గవాస్కర్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే టెస్టుల్లో ఆడేందుకు నేనెంత సిద్ధంగా ఉన్నానో.. వివరిస్తానని వ్యాఖ్యానించాడు. “నా ఫోన్ ఎప్పుడూ ఆన్ లోనే ఉంటుంది. నాకు కాల్ చేయడమో, లేక ఎస్సెమ్మెస్ అయినా పంపడమో చేయొచ్చు” అని స్పష్టం చేశాడు.
Next Story






