కర్నూలుపై బైరెడ్డి లేఖ.. పవన్ కల్యాణ్ ఆందోళన

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-04-25 01:07:15  IST  )

<p>కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తిపై ప్రముఖ సనీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి లేఖ రాశారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ వెల్లడించారు. దీనిపై ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆయన.. కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి, పాజిటివ్ కేసులు నమోదవుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని [&hellip;]</p>

కర్నూలుపై బైరెడ్డి లేఖ.. పవన్ కల్యాణ్ ఆందోళన
X

కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తిపై ప్రముఖ సనీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి లేఖ రాశారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ వెల్లడించారు. దీనిపై ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆయన.. కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి, పాజిటివ్ కేసులు నమోదవుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని ఆయన హెచ్చరించారు.

రాయలసీమ అభ్యున్నతి కోసం అహరహం శ్రమించే నిజమైన నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాసిన లేఖలో కర్నూలులో కరోనా విస్తరణపై తన ఆందోళనను వెలిబుచ్చారని పేర్కొన్నారు. కరోనా నివారణ చర్యల్లో రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు విఫలమవడాన్ని లేఖలో వివరించారని ఆయన చెప్పారు. కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

Tags: pawankalyan, janasena, ysrcp, bjp, byreddy, karnool district, coronavirus, twitter

Next Story