సమంత ఐటమ్ సాంగ్‌పై బ్రహ్మీ ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్

by  |
సమంత ఐటమ్ సాంగ్‌పై బ్రహ్మీ ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : మీమ్స్ చూడటానికి చాలా బాగుంటాయి. వీటిని ఎవరు చేశారురా.. బాబు మరీ ఇంత కరెక్ట్‌గా ఎలా సెట్ చేస్తారంటూ చాలా మంది వాటిని చూస్తూ నవ్వుకుంటారు. తాజాగా సమంత ఐటమ్ సాంగ్‌పై మీమ్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. బ్రహ్మానందం స్టెప్స్ సమంత ఐటమ్ సాంగ్‌లో కాఫీ చేశారంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

సామ్ ఐటమ్ సాంగ్ బ్రహ్మీ మీమ్స్‌పై కామెడీ స్టార్ బ్రహ్మనందం స్పందించారు. ఇటీవల ఓ షోలో బ్రహ్మానందం పాల్గొన్నారు. అక్కడ సమంత, తన ఫొటో మీమ్ ను చూపించి దీనిపై మీ అభిప్రాయం చెప్పండి అని ప్రదీప్ అడుగుతారు. దానికి సమాధానంగా బ్రహ్మానందం.. ” నేను ఎప్పుడో పాతికేళ్ల క్రితం అలా అంటే.. ఇప్పుడు సమంత కాపీ కొట్టిందని అనడం ఎంత దుర్మార్గం”అని సమాధానం ఇస్తారు. అనంతరం సేమ్ గానే ఉందండి అని ప్రదీప్ అంటే.. నేను అలా లేనులే అని బ్రహ్మానందం కౌంటర్లు వేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇవే కాకుండా చాలా మీమ్స్ చూపెట్టడంతో వాటిని చూస్తూ.. బ్రహ్మానందం నవ్వుతూ ఓ ఎక్స్ ప్రెషన్‌తో రిప్లై ఇస్తాడు.



Next Story