ఇండియన్ లెజెండ్స్‌కు బ్రిటిష్ ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రిబ్యూట్..

by  |
ఇండియన్ లెజెండ్స్‌కు బ్రిటిష్ ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రిబ్యూట్..
X

దిశ, సినిమా : 2020 ఏప్రిల్‌లో ఇండియన్ సినిమా లెజెండరీ యాక్టర్స్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొద్ది రోజుల వ్యవధిలోనే గ్రేటెస్ట్ ఆర్టిస్ట్స్ ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ అనారోగ్యంతో కన్నుమూయడం పట్ల బాలీవుడ్ దిగ్భ్రాంతికి లోనైంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బ్రిటిష్ ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్వహించిన BAFTA అవార్డ్స్ ఫంక్షన్‌లో ఈ ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్‌ను స్మరించుకోవడం విశేషం.

2020 నుంచి ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ సినిమా కోల్పోయిన 40 మంది యాక్టర్స్, డైరెక్టర్స్, రైటర్స్‌కు ఈ సందర్భంగా నివాళులు అర్పించగా.. ఈ లిస్ట్‌లో చాడ్విక్ బోస్‌మెన్, ప్రిన్స్ ఫిలిప్ కూడా ఉన్నారు. కాగా ఇర్ఫాన్ ఖాన్ హాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా.. ట్రిబ్యూట్ వీడియోలో తను నటించిన ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమాలోని డైలాగ్ యూజ్ చేశారు.

Next Story

Most Viewed