ఎమ్మెల్యే చిట్టిబాబుకు చేదు అనుభవం

42

దిశ, వెబ్‎డెస్క్: తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సచివాలయ భవనానికి భూమి పూజ నిర్వహించేందుకు వచ్చిన ఎమ్మెల్యే చిట్టిబాబును గ్రామస్తులు అడ్డుకున్నారు. సచివాలయ భవనాన్ని నిర్మించవద్దంటూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.

నేదునూరు గ్రామస్తులను కాదని ఎమ్మెల్యే చిట్టిబాబు భూమిపూజ నిర్వహించారు. ప్రభుత్వ స్థలంలో కట్టడాలను అడ్డుకుంటే కేసులు పెడతామని హెచ్చరించారు. ఎంతమంది అడ్డుకున్నా సచివాలయం కట్టి తీరతామని చిట్టిబాబు స్పష్టం చేశారు.