- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ…
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. విద్యాదీవెనపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను గతంలో హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది.
మరోవైపు ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రైవేట్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ కేసుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. గత హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించగా.. ప్రైవేట్ యాజమాన్యాల తరఫున న్యాయవాదులు విజయ్, వెంకటరమణ వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న జస్టిస్ కొంగర విజయలక్ష్మి ధర్మాసనం రివ్యూ పిటిషన్ కొట్టేస్తూ తుది తీర్పు వెల్లడించింది.
Next Story