- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంకెన్నాళ్లీ రోదనలు.. చెత్తకుండీల్లో చిన్నారులా..?
by Batti.Sumithra |
<p>దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలంలో మానవత్వం మంట కలిసిన ఘటన ఒకటి సోమవారం రాత్రి వెలుగుచూసింది. స్థానిక బస్టాండ్ ఏరియాలోని ఓ చెత్తకుండీ పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువును ఎవరో వదిలేసి వెళ్ళారు. అటుగా వస్తున్న నలుగురు యువకులు చిన్నారి ఏడుపు విని చెత్తకుండీ పక్కన పడి ఉన్న శిశువుని గుర్తించి వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆసుపత్రిలో ఆ శిశువుకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతానికి పసికందు ఆరోగ్యం బాగానే ఉన్నట్టు వైద్యం […]</p>

X
దిశ, భద్రాచలం టౌన్ : భద్రాచలంలో మానవత్వం మంట కలిసిన ఘటన ఒకటి సోమవారం రాత్రి వెలుగుచూసింది. స్థానిక బస్టాండ్ ఏరియాలోని ఓ చెత్తకుండీ పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువును ఎవరో వదిలేసి వెళ్ళారు. అటుగా వస్తున్న నలుగురు యువకులు చిన్నారి ఏడుపు విని చెత్తకుండీ పక్కన పడి ఉన్న శిశువుని గుర్తించి వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
ఆసుపత్రిలో ఆ శిశువుకు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతానికి పసికందు ఆరోగ్యం బాగానే ఉన్నట్టు వైద్యం అందించిన డాక్టర్ కె. విజయ్ తెలిపారు. చిన్నారిని చెత్తకుండీ దగ్గర పడేయడం వలన ఇన్‌ఫెక్షన్స్ సోకే అవకాశం ఉన్నందున తగిన చికిత్స చేస్తున్నామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






