- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమానవీయ ఘటన.. మరుగుదొడ్డిలో శిశువు మృతదేహం
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్ సిటీ : మరుగు దొడ్డిలో గుర్తు తెలియని మహిళ ప్రసవించగా, శిశువు మృతి చెందిన ఘటన కరీంనగర్‌లో శనివారం జరిగింది. స్థానిక రాంనగర్ చేపల మార్కెట్ సులభ్ కాంప్లెక్స్‌లో తెల్లవారుజామున నిండు గర్భవతి బాత్‌రూమ్‌కి వెళ్లి ప్రసవించింది. అయితే, డెలివరీ సమయంలో శిశువు మృతి చెందగా అక్కడే వదిలి వెళ్లినట్లు, మార్కెట్‌లో చేపలు విక్రయించే మహిళలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని వారు వాచ్‌మెన్‌కు తెలుపగా, ఆయన పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కరీంనగర్ టౌన్ […]</p>

X
దిశ, కరీంనగర్ సిటీ : మరుగు దొడ్డిలో గుర్తు తెలియని మహిళ ప్రసవించగా, శిశువు మృతి చెందిన ఘటన కరీంనగర్‌లో శనివారం జరిగింది. స్థానిక రాంనగర్ చేపల మార్కెట్ సులభ్ కాంప్లెక్స్‌లో తెల్లవారుజామున నిండు గర్భవతి బాత్‌రూమ్‌కి వెళ్లి ప్రసవించింది.
అయితే, డెలివరీ సమయంలో శిశువు మృతి చెందగా అక్కడే వదిలి వెళ్లినట్లు, మార్కెట్‌లో చేపలు విక్రయించే మహిళలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని వారు వాచ్‌మెన్‌కు తెలుపగా, ఆయన పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కరీంనగర్ టౌన్ ఏసీపీ శ్రీనివాసరావు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. సదరు మహిళ ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది.
Next Story






