- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెదక్ జిల్లాలో పసికందు అమ్మకం?
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. చిలప్ చెడ్ మండలం బద్ర్య తండా జంజారానగర్‌కు చెందిన ఓ దంపతులు ఆడ శిశువును విక్రయించినట్లు తెలుస్తోంది. గత ఆదివారం మెదక్ ప్రభుత్వాసుపత్రిలో తండాకు చెందిన సదరు మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి తిరిగి రాగా.. చుట్టుపక్కల వారు పాప ఏది అని ఆరా తీశారు. దీంతో గుట్టు రట్టైంది. ఆ దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉండగా… […]</p>
దిశ, మెదక్: జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. చిలప్ చెడ్ మండలం బద్ర్య తండా జంజారానగర్‌కు చెందిన ఓ దంపతులు ఆడ శిశువును విక్రయించినట్లు తెలుస్తోంది. గత ఆదివారం మెదక్ ప్రభుత్వాసుపత్రిలో తండాకు చెందిన సదరు మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి తిరిగి రాగా.. చుట్టుపక్కల వారు పాప ఏది అని ఆరా తీశారు. దీంతో గుట్టు రట్టైంది. ఆ దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉండగా… మరోసారి ఆడ పిల్ల పుట్టడంతో పోషణ కష్టమవుతుందని విక్రయించినట్లుగా తెలుస్తోంది.
Tags: Baby, sale, medak, crime news, ts
Next Story






