- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20 బ్లాస్ట్‌లో బాబర్ ఆజమ్
<p>దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ ఏడాది విటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో ఆడనున్నట్లు అతను ప్రాతినిథ్యం వహిస్తున్న సోమర్‌సెట్ కౌంటీ శనివారం ప్రకటించింది. గత సీజన్ విటాలిటీ బ్లాస్ట్‌లో 578 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్, తర్వాత జరిగే వన్డే సిరీస్ అనంతరం అతడు సోమర్ సెట్ జట్టుతో కలవనున్నట్లు క్రికెట్ డైరెక్టర్ ఆండీ హర్రీ తెలిపారు. అతడు టీ20లో బెస్ట్ బ్యాట్స్‌మెన్ […]</p>

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ ఏడాది విటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో ఆడనున్నట్లు అతను ప్రాతినిథ్యం వహిస్తున్న సోమర్‌సెట్ కౌంటీ శనివారం ప్రకటించింది. గత సీజన్ విటాలిటీ బ్లాస్ట్‌లో 578 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్, తర్వాత జరిగే వన్డే సిరీస్ అనంతరం అతడు సోమర్ సెట్ జట్టుతో కలవనున్నట్లు క్రికెట్ డైరెక్టర్ ఆండీ హర్రీ తెలిపారు.
అతడు టీ20లో బెస్ట్ బ్యాట్స్‌మెన్ అతని, జట్టులోకి తిరిగి చేరడం వల్ల మాకు అదనపు బలం వచ్చి చేరినట్లే అని హర్రీ అభిప్రాయపడ్డాడు. గత ఏడాది సోమర్‌సెట్ జట్టు సాధించిన విజయాల్లో బాబర్ ఆజమ్ పాత్ర కీలకంగా ఉందని, ఈ ఏడాది కూడా అతను జట్టును విజయపథంలో నడిపిస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బాబర్ ఆజమ్ కూడా సోమర్‌సెట్‌తో తిరిగి ఆడటంపై సంతోషం వ్యక్తం చేశాడు.






