అజారుద్దీన్‌కు తప్పిన ప్రమాదం

by  |
అజారుద్దీన్‌కు తప్పిన ప్రమాదం
X

దిశ,వెబ్‌డెస్క్: మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు బుధవారం పెను ప్రమాదం తప్పింది. రాజస్థాన్‌లోని సవాయి మాధవ్‌పూర్ ఆయన ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. న్యూ ఇయర్ వేడుకల కోసం అజారుద్దీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్ వెళ్లారు. అక్కడ రణతంబోర్ నేషనల్ పార్క్‌కు వెళుతుండగా ఆయన కారుకు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ కారు పక్కనే ఓ హోటల్ లోకి దూసుకు వెళ్లింది. కాగా ప్రమాదంలో అజారుద్దీన్‌ స్వల్పంగా గాయపడ్డారు.

Next Story

Most Viewed