షిల్లాంగ్‌లో ఆయుష్మాన్ ఖురానా ‘అనేక్’ షూట్

by  |
షిల్లాంగ్‌లో ఆయుష్మాన్ ఖురానా ‘అనేక్’ షూట్
X

దిశ, సినిమా : అనుభవ్ సిన్హా-వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ‘అనేక్’. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్టికల్ 15’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. భారతదేశంలో వేళ్లూనుకుపోయిన కులవ్యవస్థ నేపథ్యంలో తీసిన ఈ మూవీ సగటు ప్రేక్షకుడిని మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలోనే వీరి రెండో సినిమా ‘అనేక్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘అనేక్’ మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితం అస్సాంలోని కజిరంగ నేషనల్ పార్కులో ప్రారంభమైంది. ప్రొడక్షన్ వర్క్ ప్లస్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న మూవీ యూనిట్.. తదుపరి షెడ్యూల్ కోసం ఇటీవలే మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు మూవ్ అయింది. కాగా షిల్లాంగ్‌లోని సుందర దృశ్యాల్లో షూటింగ్‌కు రావడం ఇదే మొదటిసారి అని, ఇక్కడకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని హీరో ఆయుష్మాన్ తెలిపారు. ‘అనేక్’ షూటింగ్ రోజులను తను జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని పేర్కొన్నారు. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్‌తో సినిమా ఉంటుందని డైరెక్టర్ అనుభవ్ చెప్పారు.



Next Story

Most Viewed