సినిమాలు వర్కౌట్ కాక.. బర్త్ డే పార్టీలను నమ్ముకున్న హీరో

by  |
సినిమాలు వర్కౌట్ కాక.. బర్త్ డే పార్టీలను నమ్ముకున్న హీరో
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఆటోబయోగ్రఫీ ‘క్రాకిండ్ ద కోడ్ : మై జర్నీ ఇన్ బాలీవుడ్’ చాలా మందికి ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాక బ్యాక్ టు బ్యాక్ మూడు డిజాస్టర్ ఫిల్మ్స్ చేసిన ఆయుష్మాన్ తిరిగి చండీఘఢ్ బాటపట్టక తప్పదనే కామెంట్స్ వచ్చాయి. ఆ సమయంలో ఖాళీగా ఉన్న తాను ఈ బుక్ రాసినట్లు తెలిపాడు. అప్పుడు ఏదీ వర్కౌట్ కాలేదని, దీంతో తాను ‘ఆయుష్మాన్ భవ’ బ్యాండ్ పేరుతో కన్సర్ట్స్ చేయడం ప్రారంభించానని చెప్పాడు.

సినిమాలు వర్కౌట్ కాకపోతే.. బర్త్ డే పార్టీస్‌లో సింగింగ్, డ్యాన్స్ చేసేందుకు నిర్ణయించుకున్నానని.. ప్రజలను ఎంటర్‌టైన్ చేస్తూ మరిన్ని బుక్స్ రాసేందుకు డిసైడ్ అయ్యానని వివరించాడు. అర్బాజ్ ఖాన్ టాక్ షో ‘పించ్ 2’లో పాల్గొన్న ఆయన.. ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇక తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ‘ఫీల్స్ లైక్ ఇష్క్’ ఆంథాలజీలో పాట పాడాడు ఆయుష్మాన్. తన వైఫ్ తహీరా కశ్యప్ దర్శకత్వం వహించిన ‘క్వారంటైన్ క్రష్‌’ పార్ట్‌లో పాట పాడి అభిమానులను మెస్మరైజ్ చేశాడు.


Next Story

Most Viewed