- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ వైద్యుల రిటైర్మెంట్ పరిమితి పెంపు
<p>దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న వైద్యుల పదవీ విరమణ వయసును 65 ఏళ్ళకు పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్సు జారీ చేసింది. తక్షణమే ఇది అమలులోకి వచ్చేలా గెజిట్ కూడా విడదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయుష్ (ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి) విభాగంలో పనిచేస్తున్న వైద్యుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్ళకు పెంచనున్నట్లు ఇటీవల మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించారు.ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు కూడా వెలువడింది. […]</p>

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న వైద్యుల పదవీ విరమణ వయసును 65 ఏళ్ళకు పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్సు జారీ చేసింది. తక్షణమే ఇది అమలులోకి వచ్చేలా గెజిట్ కూడా విడదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయుష్ (ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి) విభాగంలో పనిచేస్తున్న వైద్యుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్ళకు పెంచనున్నట్లు ఇటీవల మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించారు.ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు కూడా వెలువడింది. ఇప్పుడు దానికి సంబంధించి ఆర్డినెన్సు జారీ అయింది.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఉనికిలో లేనందున ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత దీనికి సంబంధించి బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో బడ్జెట్ సమావేశాలు ముగిశాక వెలువడిన నాల్గొ ఆర్డినెన్సు ఇదే కావడం గమనార్హం.






